ఆనందం మూడింతలు.. ఒకే కాన్పులో పాప, ఇద్దరు బాబులు

ఆనందం మూడింతలు.. ఒకే కాన్పులో పాప, ఇద్దరు బాబులు

ఆ ఇంట బిడ్డ పుట్టిన ఆనందం మూడింతలైంది. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ తల్లి.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన శిరీష-మహేష్ దంపతులకు మొదటి కాన్పులోనే అమితమైన ఆనందం సొంతమైంది. వారికి పాప, ఇద్దరు బాబులు జన్మించారు. తల్లీ- బిడ్డలు క్షేమంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు.