బంగ్లా ప్రధానికి త్రిపుర సీఎం కానుక

బంగ్లా ప్రధానికి త్రిపుర సీఎం కానుక

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు త్రిపుర సీఎం మాణిక్ సాహా కానుక పంపించారు. ప్రపంచంలోనే ది బెస్ట్ వెరైటీగా పేరొందిన ‘క్వీన్ పైనాపిల్’ పండ్లను 500 కిలోలు పంపించారు. భారత్-బంగ్లాదేశ్​ల పురాతనమైన స్నేహానికి గుర్తుగా ఈ కానుక పంపిస్తున్నట్లు సాహా చెప్పారు. గతేడాది కూడా సాహా బంగ్లా ప్రధానికి పైనాపిల్స్ పంపించారు. సీఎం ఆదేశాల మేరకు హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులు పైనాపిల్స్ ను జాగ్రత్తగా ప్యాక్ చేసి ట్రక్కులో లోడ్ చేయించారు.