అల్లు అర్జున్కి అక్కలా ఉంటుంది.. వద్దే వద్దు గురూజీ!?

అల్లు అర్జున్కి అక్కలా ఉంటుంది.. వద్దే వద్దు గురూజీ!?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu)తో గుంటూరు కారం(Guntur karam) అనే సినిమా చేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్, టీజర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా నుండి వస్తున్న చిన్న అప్డేట్ అయినా కక్షణాల్లో వైరల్ అవుతోంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

ఇదిలా ఉంటే.. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేశారు. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్  కూడా వచ్చేసింది. ఈ సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా త్రిషను తీసుకుంటున్నారట త్రివిక్రమ్. కథల్లో పాత్రకు తగ్గ బలం చేకూరేలా త్రిష నటన ఉంటుందని ఆమెను ఓకే చేసినట్లు సమాచారం. అయితే ఈ సెలెక్షన్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తిగా ఉన్నారట. బన్నీ పక్కన త్రిష అక్కలా కనిపిస్తుందని, మరోసారి ఆలోచించండి గురూజీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. మరి ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ పై మూవీ టీమ్ ఎలా స్పదించనున్నారు? అసలు ఈ సినిమా కోసం త్రిషను తీసుకోవడం నిజమేనా? అనేది తెలియాల్సి ఉంది.