
పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కిన ‘భీమ్లానాయక్’ శుక్రవారం విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ ఉండటంతో సక్సెస్ మీట్ నిర్వహించారు. స్క్రీన్‌ప్లే రాసిన త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్ నుంచి బయటకు రావడానికి చాలా మార్పులు చేశాం. పవన్ కల్యాణ్‌లాంటి స్టార్‌తో సినిమా అంటే చాలా విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. అభిమానులు కోరుకునే అంశాలు మిస్ కాకూడదు. అందుకే అందరం కష్టపడ్డాం. మంచి టీమ్ కుదిరింది’ అన్నారు. ‘త్రివిక్రమ్ మా సినిమాకి బ్యాక్‌బోన్‌గా నిలిచారు. కథలోకి వెళ్లి దానికి ఎలాంటి సంగీతం కావాలో అర్థం చేసుకుని మ్యూజిక్ ఇచ్చారు తమన్. రెస్పాన్స్, కలెక్షన్ రిపోర్ట్స్ చూశాక చాలా ఆనందంగా ఉంది’ అన్నాడు డైరెక్టర్ సాగర్ చంద్ర. తమన్ మాట్లాడుతూ ‘సినిమా విడుదల విషయంలో ఎన్నో కామెంట్లు విన్నాం. వాటికి సమాధానం చెప్పడానికి ఏడు నెలలుగా ఎంతో శ్రమించి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. మా సంకల్పం గొప్పది. అందుకే పెద్ద కమర్షియల్ హిట్ అయింది’ అన్నాడు. ఇంతటి ఘన విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉందంది సంయుక్త. నిర్మాత సూర్యదేవర నాగవంశీతో పాటు ప్రియాంక, రామజోగయ్యశాస్త్రి, కాసర్ల శ్యామ్, గణేష్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.