పెళ్లయిన రేండేళ్లకు భర్తకు భోజనం వండి పెట్టిన భార్య.. శోభితపై చైతూ క్రేజీ కామెంట్!

పెళ్లయిన రేండేళ్లకు భర్తకు భోజనం వండి పెట్టిన భార్య.. శోభితపై చైతూ క్రేజీ కామెంట్!

టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ కపుల్స్‌ నాగ చైతన్య - శోభిత ధూళిపాళ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.  డిసెంబర్ 4, 2024న పెళ్లిపీటలెక్కన ఈ జంట.. అప్పుడప్పుడూ తమ  వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వాటిని  అభిమానులతో పంచుకుంటుంటారు. లేటెస్ట్ గా తమ క్యూట్, క్రేజీ ముచ్చట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. నాగ చైతన్య షేర్ చేసిన ఓ ఫోటో, దానికి శోభిత ఇచ్చిన చిలిపి రిప్లై నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

చై క్రేజీ కామెంట్!

నాగ చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో శోభిత వంటగదిలో నుంచి డైనింగ్ టేబుల్ వైపు తాజాగా వండిన వంటకాల బౌల్స్ తీసుకొస్తున్న  ఒక సరదా ఫోటోను షేర్ చేశాడు. 'పెళ్లయిన రెండేళ్లకు మా ఆవిడ నాకు డిన్నర్ వండి పెట్టింది.. అంటే ఈ రోజు నేను ఏదో పెద్ద మంచి పనే చేసి ఉంటాను!' అంటూ సరదాగా రాసుకొచ్చాడు .  ప్రస్తుతం చైతూ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. 

ట్రోల్ చేస్తున్నావా...  పొగుడుతున్నావా?

ఈ పోస్ట్‌ను చూసిన శోభిత కూడా వెంటనే కామెంట్ చేస్తూ..  'నన్ను ట్రోల్ చేస్తున్నావా... లేక పొగుడుతున్నావా?' అంటూ ఫన్నీగా స్పందించింది. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ చిలిపి మాటల యుద్ధం అభిమానులను బాగా ఎంటర్‌టైన్ చేసింది. ఇలా మీ ఇద్దరి పోస్టులు ఇంకా ఎక్కువగా షేర్ చేయండి,  చైతన్య ట్రోల్ చేస్తున్నాడనుకుంటా, 'ఇద్దరి కెమిస్ట్రీ సూపర్' అంటూ నెటిజన్లు వరుసగా కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ : Governor OTT Release: ఓటీటీలోకి రియలిస్టిక్ పొలిటికల్ డ్రామా 'గవర్నర్'.. 

ఇదిలా ఉంటే, గతంలో కూడా శోభిత తన కుకింగ్ స్కిల్స్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. సాంబార్ రుచి చూస్తూ, బెండకాయలు కోస్తూ, రోకలిబండతో మసాలా నూరుతూ కనిపించిన ఆ వీడియోకు '#BasicHumanSkills #SetLife' అంటూ సరదా క్యాప్షన్ ఇచ్చి నాగ చైతన్యను ట్యాగ్ చేసింది. ఆ వీడియో అప్పట్లో కూడా మంచి స్పందన తెచ్చుకుంది.

బిజీ లైఫ్ తో.. 

ప్రస్తుతం ఈ జంట తమ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న సరదా క్షణాలతో అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. నాగ చైతన్య ప్రస్తుతం 'వృషకర్మ' లో నటిస్తున్నారు. శోభిత కూడా వరుస చిత్రాలు, ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతోంది.  తాను నటించిన తమిళ చిత్రం 'వెట్టువం' రిలీజ్ కు రిలీజ్ కు సిద్ధమవుతోంది.