అటవీ భూములు అన్యాక్రాంతం

అటవీ భూములు అన్యాక్రాంతం

రెవెన్యూ, ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల మధ్య సమన్వయ లోపం

నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల మధ్య సమన్వయలోపంతో కోట్ల విలువైన భూములు మాయం అవుతున్నాయి. రెండు శాఖల మధ్య సరిహద్దు వివాదాలు నెలకొనడంతో వందల ఎకరాల ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల్యాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టా భూములుగా మారుతున్నాయి. పోడు భూములపై హక్కులు కల్పించాలని ఓ వైపు గిరిజనులు పోరాడుతుంటే, మరోవైపు బినామీల పేర్లతో ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల్యాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కబ్జా చేస్తున్నారు. 

రెండు శాఖల మధ్య కనిపించని సమన్వయం

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీ పరిధిలో 30 ఎకరాల అటవీ భూమి వివాదాస్పదంగా మారింది. ఈ ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అటవీశాఖదేనని తేలినప్పటికీ రెవెన్యూ శాఖ కొందరి పేరున పట్టాలు జారీ చేసింది. దీనికి బదులు వేరేచోట ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తామని రెవెన్యూ శాఖ చెప్పి మూడేళ్లు అయినా ఇప్పటికీ అతీగతీ లేకుండా పోయింది. మరోవైపు సూర్యాపేట జిల్లాలోని కృష్ణ పట్టె ప్రాంతాలైన నేరేడుచర్ల, మఠంపల్లి, మేళ్లచెరువు తదితర మండలాల పరిధిలో 60 వేల ఎకరాల  భూముల విషయంలో రెండు శాఖల మధ్య హద్దుల వివాదం నడుస్తోంది. దీన్ని అడ్డంపెట్టుకొని కొందరు ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు అధికారుల సాయంతో వందల ఎకరాల భూములను కబ్జా చేస్తున్నారు. కృష్ణ పట్టె పరిధిలోని సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశ్రమల ఆధీనంలోనే వేల ఎకరాలు ఉండడంతో హద్దుల వివాదం ఎటూ తేలడం లేదు. తాజాగా నల్గొండ జిల్లా దేవరకొండ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తలెత్తిన సరిహద్దుల వివాదం రెండు శాఖల మధ్య కొత్త చిచ్చు పెట్టింది. 

ముదిగొండ, శేరిపల్లిలో హద్దుల వివాదం

దేవరకొండ మండలం ముదిగొండ, శేరిపల్లి గ్రామాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తోంది. 1965లో ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌లో ముదిగొండ, నసర్లపల్లి, మల్లారెడ్డిపల్లి, కొక్కిరాల, గౌరారంలో సుమారు 1200 ఎకరాల ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ముదిగొండ, శేరిపల్లి గ్రామాల మద్యే వివాదం నెలకొంది. శేరిపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 234, 236, 231, 230, 229, 204,225లో సుమారు 200 ఎకరాల భూమిని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన కొందరు వ్యక్తులు కొన్నారు. వీళ్ల కంటే ముందు ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ ఈ ప్రాంతంలో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టాలన్న ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో స్థానికుల నుంచి భూములు కొన్నది. కానీ ప్రాజెక్టు చేపట్టకపోవడంతో ఆ భూములు చివరకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన కొందరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూములపై తమకే హక్కులు ఉన్నాయంటూ హద్దురాళ్లు పాతేందుకు ప్రయత్నించారు. కానీ అటవీశాఖ గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంక్వైరీ చేయగా శేరిపల్లిలోని 200 ఎకరాల్లో 40 ఎకరాలు ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములేనని తేలింది. కానీ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం శేరిపల్లిలో ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల్యాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేవని చూపుతుండడం వివాదానికి కారణమైంది. ప్రస్తుత రికార్డుల ప్రకారం మొత్తం భూమి తమదేనని కొన్న వారు పట్టుబడుతుండగా, హద్దుల వివాదం తేలే వరకు పనులు చేయొద్దని ఆఫీసర్లు సూచించారు.

ఆఫీసర్లపై రాజకీయ ఒత్తిళ్లు

ముదిగొండ, శేరిపల్లి గ్రామాల్లోని భూములు రూ. కోట్లు పలుకుతున్నాయి. దేవరకొండ, చింతపల్లి మండలాల మధ్య, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమీపంలో ఉండడంతో ఎకరం రూ. 30 లక్షల వరకు పలుకుతోంది. పైగా ఇదే ప్రాంతంలో ప్రభుత్వం గొట్టిముక్కల రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తోంది. దీంతో ఈ భూములపై కూడా రాజకీయ నేతల కన్ను పడింది. ముదిగొండ, శేరిపల్లి భూముల వ్యవహారంలో పాత రెవెన్యూ రికార్డులు మార్చాలని అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత ఒకరు రెవెన్యూ ఆఫీసర్లపైన ఒత్తిడి చేశారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకు సహరించకపోవడంతోనే తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్నారని ఆఫీసర్లు చెప్పారు. ఇప్పుడు ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సర్వే చేస్తున్న ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లపై పొలిటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీవ్రంగానే ఉందని తెలుస్తోంది. ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పైస్థాయిలో ప్రయత్నాలు 
చేస్తున్నట్లు తెలిసింది.