కేబుల్​ బిల్లులు తగ్గించనున్నట్రాయ్

కేబుల్​ బిల్లులు తగ్గించనున్నట్రాయ్

న్యూఢిల్లీ: నచ్చిన చానెళ్లే, చూసే చానెళ్లే తీసుకునేలా వినియోగదారుడి కోసం కొత్త ప్లాన్​ అమలు చేసింది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్​ ఇండియా (ట్రాయ్​). కానీ, అది బెడిసికొట్టింది. ఖర్చు తగ్గుతుందనుకుంటే, ఇంకా ఎక్కువైతోందని చాలా మంది వినియోగదారులు ట్రాయ్​కు ఫిర్యాదు చేశారు. నిజమే మరి. ఇప్పుడు ఎక్కువ చానెళ్లు పెట్టుకోవాలనుకుంటే చేతి చమురు వదలాల్సిందే. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే కేబుల్​, డీటీహెచ్​ రేట్లను తగ్గించేలా ట్రాయ్​ కసరత్తులు చేస్తోంది. కేబుల్​ బిల్లులు తగ్గించాలంటే ఏం చేయాలో చెప్పాలంటూ డీటీహెచ్​ సంస్థలకు సూచనలతో కూడిన నోట్​ (కన్సల్టేషన్​ పేపర్​)ను పంపనుంది. ఒకవేళ ఆ కన్సల్టేషన్​ పేపర్​ ఆమోదం పొందితే, కేబుల్​ బిల్లులు తగ్గి వినియోగదారుడికి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఇక, ఈ విషయాన్ని ట్రాయ్​ అధికారి ఒకరు ధ్రువీకరించారు. టీవీ చానెళ్ల ధరలు తగ్గించాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఫలితాన్నివ్వలేదని, అందుకే చానెళ్ల ధరలు తగ్గించేలా డీటీహెచ్​, కేబుల్​ సంస్థల నుంచి ట్రాయ్​ కన్సల్టింగ్​ పేపర్లను కొద్ది రోజుల్లో పిలుస్తుందని ఆయన చెప్పారు. అది ఆమోదం పొందితే చట్టబద్ధంగా చానెళ్ల టారిఫ్​లు, నిబంధనలను ట్రాయ్​ పొందుపరిచే అవకాశం ఉంటుందని వివరించారు