పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : వట్టే జానయ్య యాదవ్

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : వట్టే జానయ్య యాదవ్
  • టీఆర్‌‌‌‌పీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ 

సూర్యాపేట, వెలుగు: క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ అన్నారు‌‌. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో శనివారం పలువురు నీరజ గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్పీ లో చేరారు. అనంతరం జిల్లా మహిళా కమిటీని ప్రకటించారు. జిల్లా టీఆర్పీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా  కొన్నె మంజుల గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నారాయణదాసు కవిత, జిల్లా ఉపాధ్యక్షురాలు వర్రె కవిత యాదవ్, టీఆర్పీ ఎస్‌‌టీ  విభాగం పట్టణ అధ్యక్షుడిగా  ధరావత్  సేవ్యా నాయక్  లను జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నియామకం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి రోజున పార్టీలో చేరడం మంచి శుభ పరిణామం అని తెలిపారు.  జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో కమిటీలు భర్తీ చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చైతన్యం చేస్తూ బహుజన రాజ్యాధికారం దిశగా కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.