బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత

బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాద యాత్రలో ఉద్రిక్తత నెలకొంది.  ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో పాద యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు టీఆర్ఎస్ కార్యకర్తలు. దీంతో పోటా పోటీగా బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేసుకున్నారు. సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు టీఆర్ఎస్  నేతలు. పరిస్థితి సీరియస్ గా మారుతుండటంతో... రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు. అయితే సంజయ్ యాత్రను అడ్డుకోవటంపై మండిపడుతున్నారు బీజేపీ నేతలు.

అంతకుముందు అలంపూర్ నియోజకవర్గంలోని వేముల గ్రామంలో బండి సంజయ్ మాట్లాడారు. కాళేశ్వరం నీళ్లను ఫాంహౌస్ కు తరలించేందుకు కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలకు నీళ్లు ఎందుకు ఇవ్వటం లేదే కేసీఆర్ చెప్పాలన్నారు. రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు సంజయ్. నకలీ విత్తనాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవటం లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ విస్మరించారన్నారు డీకే అరుణ. ఆర్డీఎస్ ద్వారా జిల్లాకు నీళ్లు ఇవ్వాలన్నారు.