
మెదక్ జిల్లా తూప్రాన్ ఎంపీపీ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కో ఆప్షన్ సభ్యుడి ఎన్నికల సమయంలో.. టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బాహాబాహీకి దిగారు. ఘన్ పూర్ టీఆర్ఎస్ రెబెల్ ఎంపీటీసీ.. కాంగ్రెస్ కు మద్దతివ్వడంతో.. ఘర్షణ చెలరేగింది. కో ఆప్షన్ పత్రాలు సమర్పించే టైంలో.. ఓ మహిళా ఎంపీటీసీ కుమారుడు.. ఆంజనేయులు ఎంపీపీ ఆఫీసులో బీభత్సం సృష్టించాడు. కో ఆప్షన్ పత్రాలు చించడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.