నిజామాబాద్ మేయర్ కుర్చీ టీఆర్ఎస్‌కా.. మజ్లిస్‌కా..

నిజామాబాద్ మేయర్ కుర్చీ టీఆర్ఎస్‌కా.. మజ్లిస్‌కా..

నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మేయర్ సీటుపై అధికార టీఆర్ఎస్, మజ్లిస్ కన్నేశాయి. మేయర్ సీటు కోసం మజ్లిస్ ఇప్పటికే మంతనాలు షురూ చేసింది. మజ్లిస్ అధినేత అక్బరుద్దీన్ ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మేయర్ పదవి వదులుకోవడానికి టీఆర్ఎస్ అంగీకరించకపోతే.. నిజామాబాద్‌లో హంగ్ ఏర్పడే అవకాశముంది. నిజామాబాద్‌లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. వాటిలో 28 డివిజన్లను బీజేపీ గెలుచుకుంది. టీఆర్ఎస్, మజ్లిస్ కలవకపోతే.. బీజేపీదే మేయర్ కుర్చీ అవుతుంది. కాగా.. మరో 16 డివిజన్లలో మజ్లిస్, 13 డివిజన్లలో టీఆర్ఎస్, రెండు చోట్ల కాంగ్రెస్, ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. దాంతో ఎలాగైనా మేయర్ పదవి దక్కించుకోవాలని అటు మజ్లిస్, ఇటు టీఆర్ఎస్ కూడా పావులు కదుపుతున్నాయి. మేయర్ కుర్చీ దక్కించుకోవడంలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. అధికార పార్టీకి ముగ్గురు ఎమ్మెల్సీలు, ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం ఆరు ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే టీఆర్ఎస్‌కే అధిక మెజార్టీ వస్తుంది. మరి టీఆర్ఎస్ మేయర్ పదవి చేపడుతుందో.. లేక మజ్లిస్‌కి ఇస్తుందో చూడాలి. అంతేకాకండా.. మజ్లిస్, టీఆర్ఎస్ కలిసి మేయర్ కుర్చీని పంచుకుంటాయో కూడా చూడాలి. దీంతో.. నిజామాబాద్ మేయర్ సీటు ఎవరికి సొంతం అవుతుందన్న దానిపై ఆసక్తి పెరుగుతుంది.

For More News..

జూపల్లికి కేటీఆర్ నో అపాయింట్‌మెంట్

యువతకు పార్ట్ టైం జాబ్‌గా ర్యాపిడ్ రైడ్

యాభైవేల చెట్లు పెంచిన ఒకే ఒక్కడు.. పద్మశ్రీతో సత్కారం