ర్యాలీ పేరుతో టీఆర్ఎస్, ఎంఐఎం డ్రామా ఆడుతోంది: భట్టి

ర్యాలీ పేరుతో టీఆర్ఎస్, ఎంఐఎం డ్రామా ఆడుతోంది: భట్టి

TRS,MIM పార్టీల తీరును తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. గాంధీ కావాలా.. గాడ్సే కావాలా అంటూ నిజామాబాద్‌లో సీఎం కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన ర్యాలీ.. TRS,MIM ఆడుతున్న డ్రామా అంటూ  ఆరోపించారు. CAAకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మొదటి నుంచి పోరాటం చేస్తోందన్నారు భట్టి. వ్యతిరేకించే వారు ఎవరైనా తమ ఆందోళనలో పాల్గొనవచ్చునని పిలుపునిచ్చారు. కేసీఆర్ లౌకిక వాది అయితే 28న తమ ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మేము మొదటి నుంచి గాంధీ వాదాన్నే చెబుతున్నామని, ఇప్పుడు అందరూ అక్కడికే వచ్చి ఆగుతున్నారన్నారు భట్టి విక్రమార్క.