
లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో నిందితుడిగా వున్న కుంట శ్రీనివాస్‌ను తమ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. పార్టీ మండల అధ్యక్షుడిగా వున్న కుంట శ్రీనివాస్‌ను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. సస్పెన్షన్ తక్షణమే అమలవుతుందని ఆయన చెప్పారు. అడ్వకేట్ వామన్ రావు దంపతులను హత్య కేసులో ముగ్గురిని పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. ఈ నెల 17వ తేదీన కాల్వచర్లలో వామనరావు దంపతులను దుండగులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే