
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. సోమవారం ఆలయ ఓపెన్స్లాబ్లో పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో సేవా సమితి సభ్యులు, ఆలయ సిబ్బంది హుండీలను లెక్కించారు. 25 రోజులకు సంబంధించి రూ. 1 ,99 ,84 ,960 నగదు, 188 గ్రాముల బంగారం , 14.30 కిలోల వెండి వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఇన్ చార్జ్ ఈఓ రాధాబాయి, ఏసీ ఆఫీసు పరిశీలకుడు సత్యనారాయణ , ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నా రు. అదేవిధంగా సోమవారం సుమారు 24 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొందరు భక్తులు కోడె మొక్కులు చెల్లించారు. ఆషాడమాసం కావడంతో భక్తుల సంఖ్య చాలావరకు తగ్గింది.