TRS, కాంగ్రెస్‌ మధ్య కొట్లాట

TRS, కాంగ్రెస్‌ మధ్య కొట్లాట

వెలుగు: పరిషత్‌‌ మొదటి విడత ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలో అక్కడకక్కడ ఘర్షణలు జరిగాయి.సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‍ఖాన్ పేటలోని ఓపోలింగ్‍ బూత్‍ వద్ద కాంగ్రెస్ లోని ఇరువర్గాలు కొట్లాడుకున్నాయి. అందులో ఓ కాంగ్రెస్‍ కార్యకర్త టీఆర్‍ఎస్ తో కలిసిపోవడంతో వివాదం కాస్తా రెండు పార్టీల మధ్య గొడవకు దారితీసింది. ఇరువర్గాలు ఘర్షణ పడుతుండడంతో పోలీసులు లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. ఇర్గిపల్లిలోని పోలింగ్‍ బూత్‍ వద్దకు టీఆర్‍ఎస్‍ కార్యకర్త ఓటర్లను తీసుకువచ్చాడు. వారుతమ పార్టీ ఓటర్లని, మీరెందుకు తీసుకువస్తున్నారంటూ కాంగ్రెస్‍ నాయకుడొకరు టీఆర్‍ఎస్‍ కార్యకర్త చెంప మీద కొట్టాడు. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు కొట్లాటకు సిద్దపడ్డారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో లాఠీలకు పని చెప్పారు. పటాన్ చెరు,అమీన్ పూర్‍, జిన్నారం, హత్నూర మండలాల్లో కూడా టీఆర్‍ఎస్‍, కాంగ్రెస్‍ కేడర్‌‌ మధ్య గొడవలు జరిగాయి