
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో ఓ ఇంటి ముందు నిచ్చెన పెట్టడం, కారు పార్కింగ్ చేయడం .. రెండు పార్టీల నేతల మధ్య కొట్లాటకు దారి తీసింది. టీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ నర్సింహా, కాంగ్రెస్ నేత వీరారెడ్డి గొడవ పెట్టుకున్నారు. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఇద్దరు పరస్పరం రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు.