కాంగ్రెస్ లో టీఆర్ఎస్​ కోవర్టులున్నారు

కాంగ్రెస్ లో టీఆర్ఎస్​ కోవర్టులున్నారు

కోరుట్ల, వెలుగు : కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని, వారిని గుర్తించి ఏరేయాలని కాంగ్రెస్​కోరుట్ల నియోజకవర్గ ఇన్​చార్జి జువ్వాడి నర్సింగరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో దేవిశ్రీ గార్డెన్ లో గురువారం నిర్వహించిన మేధోమథనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏళ్లుగా కాంగ్రెస్ కోసం పని చేస్తున్నవారిని కాదని మధ్యలో వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశారు. నేతలతో కలిసి భోజనం చేసేది లేదని నిరసన వ్యక్తం చేశారు.  కాంగ్రెస్​లో సభ్యత్వం లేకున్నా కల్వకుంట్ల సుజిత్ రావును  మీటింగ్​కు ఎలా ఆహ్వానిస్తారని మండిపడ్డారు. అయితే తనకు ఈ విషయంలో ఏ సంబంధంలేదని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి సర్ది చెప్పారు. అనతరం కొందరు పార్టీ నేతల తీరుపై నర్సింగరావు అసంతృప్తి వ్యక్తం చేశారు.