గ్రేటర్ ఎన్నికలపై టీఆర్ఎస్ నజర్

గ్రేటర్ ఎన్నికలపై టీఆర్ఎస్ నజర్
  • నియోజకవర్గాల వారిగా ఇన్చార్జీల నియామకం
  • సోషల్ మీడియాలో ప్రచారానికి సన్నాహాలు
  •  పార్టీ నేతలతో కేటీఆర్ మీటింగ్

జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ రెడీ అవుతోంది. గ్రౌండ్ లెవెల్ లో పార్, ప్రభుత్వ పరిస్థితులను తెలుసు కునేందుకు సర్వేలు జరిపిస్తోంది. సిట్టింగ్ కార్పోరేటర్ల పనితీరుతో పాటు టికెట్ ఆశించే వారిపై రిపోర్టులు తెప్పించుకుంటుంది. పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని యాక్వేట్  చేసింది. ఈ సారి సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ప్రచారం చేయాలని భావిస్తోంది. ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలి కాల పరిమితి వచ్చే ఏడాది జనవరి చివరితో ముగుస్తోంది. ఈ ఏడాది చివరన అంటే డిసెంబరులో గ్రేటర్ ఎన్నిక లను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని పార్టీ లీడర్లు తెలిపారు. అందుకోసమే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిటీలోని అభివృద్ది పనులపై ఫోకస్ పెట్టడంతో పార్టీ అంతర్గత కమిటీలపై  దృష్టి సారించారని అంటున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ కు ఇద్దరు ఇన్చార్జీలు గ్రేటర్ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో సెగ్మెంట్ కు ఒక ఎమ్మెల్సీ, ఒక సీనియర్ లీడర్ ను పార్టీ ఇన్ చార్జీలుగా నియమించారు. అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని డివిజన్లలో పార్టీ  ప్రభుత్వ పరిస్థితిపై రిపోర్టు ఇవ్వాలని కేటీఆర్ ఆదేశించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కోవిడ్ నిబంధనలను దృష్లో  పెట్టుకుని ఈ సారి సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున ఎలక్షన్ ప్రచారం చేయాలని పార్టీ భావిస్తోంది. ఇందుకోసం ఆల్రెడీ సోషల్ మీడియా ఇన్ చార్లను నియమించారు. వీరితో కేటీఆర్ ఇప్పటికే సమావేశమైనట్టు పార్టీనేతలు తెలిపారు. ఇప్పటి నుంచే సోషల్ మీడియా ద్వారా ప్రతి డివిజన్ లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించే పోస్టింగ్ లను తయారు చేయాలని సూచించినట్టు వివరించారు. వీరి కోసం తెలంగాణ భవన్ లో ప్రత్యేకంగా రెండు గదులను కూడా కేటాయించినట్లు తెలుస్తోంది.

ఏ పార్టీకి ఓటేస్తారు?

జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఓటరు నాడిని తెలుసు కునే ప్రయత్నానికి టీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం వరుసగా సర్వేలు జరిపిస్తోంది. ప్రభుత్వ విభాగాలతో పాటు, ప్రత్యేక సర్వే ఎజెన్సీల ద్వారా రిపోర్టులు తెప్పించుకుంటోంది. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? స్థానిక లీడర్లు అందుబాటులో ఉంటున్నారా? కార్పొరేటర్ పనితీరు ఎలా ఉంది? ఎలక్షన్స్ లో ఏ పార్కిటీ ఓటేస్తారు అనే ప్రశ్నలను సర్వేయర్లు అడుగుతున్నారు.

సగం మంది సిట్టింగ్ లకు చెక్

గ్రేటర్ ఎన్నికల్లో సగం మంది సిట్టింగ్ లకు టికెట్ ఇవ్వొద్దనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు లీడర్లు చెప్తున్నారు. మెజార్టీ కార్పొరేటర్లపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, నేరుగా కేటీఆర్ కు ఫిర్యాదులు వచ్చాయని అంటున్నారు. కార్పొరేటర్ గా గెలిచాక వారు సంపాదించిన ఆస్తుల వివరాలపై నిఘా వర్గాలు నివేదికలు ఇచ్చినట్టు తెలిపారు.