
హుజూర్ నగర్ నగర్ ఉప ఎన్నిక తేదీ ఖరారవ్వడంతో పార్టీలు స్పీడప్ అయ్యాయి. అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును ఖరారు చేశారు సీఎం కేసీఆర్. సైది రెడ్డి నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన స్వల్ప తేడాతో ఓడిపోయారు సైది రెడ్డి. మరో వైపు ఉపఎన్నిక టికెట్ మరోసారి తనకు ఇవ్వాలని అమరవీరుడైన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ డిమాండ్ చేశారు. హుజూర్ నగర్ టికెట్ తనకు ఇస్తే…కాంగ్రెస్, బిజెపిలతో మాట్లాడి ఏకగ్రీవం కోసం ప్రయత్నం చేస్తానన్నారు . తనకివ్వకపోతే మాజీ ఎంపీ కవితకు టికెట్ ఇవ్వాలన్నారు. ఇక సిట్టింగ్ స్థానం దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా తన భార్య పద్మావతి పేరును ప్రకటించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.