ఆర్థిక సంక్షోభంలో టీఆర్ఎస్ ప్రభుత్వం : కిషన్ రెడ్డి

ఆర్థిక సంక్షోభంలో టీఆర్ఎస్ ప్రభుత్వం : కిషన్ రెడ్డి

దేశాన్ని విమర్శించడం సీఎం కేసీఆర్కు అలవాటైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశాన్ని చైనా, పాకిస్థాన్లతో పోల్చడం కేసీఆర్కు పరిపాటిగా మారిందన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించిన సభపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 9ఏళ్లలో ఒక్క రూపాయి అవినీతికి పాల్పడని ఘనత మోడీ ప్రభుత్వానిదన్నారు. మేకిన్ ఇండియాతో వందే భారత్ రైళ్లు తయారు చేసుకుంటున్నట్లు చెప్పారు. 9 వందల కోట్ల నుంచి 15వేల కోట్లకు ఎగుమతులు పెంచామన్నారు. దేశంలో పూర్తిస్థాయిలో విద్యుత్ అందుబాటులోకి వచ్చిందన్నారు. కేంద్ర సర్కార్ మీటింగ్లకు కేసీఆర్ వచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 9ఏళ్లుగా రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సంపదను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందని.. ఇప్పుడు దేశాన్ని దోచుకునేందుకు సిద్ధమైందని ఆరోపించారు. 9ఏళ్లలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. కేంద్ర నిధులతోనే గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. హాస్టళ్లలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులు చనిపోతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని.. కేసీఆర్ అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.