
అన్ని కులాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారన్నారు మాజీమంత్రి ఈటల రాజేందర్. అన్ని కులాల ఆత్మగౌరవ భవనాలు కడుతున్నామన్నారు. రవీంద్రభారతిలో ఆరెకటిక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ కు ఆత్మీయ సన్మానం చేశారు. ఆరెకటికల సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఈటల. చిన్న కులాలకు మేలు చేయాలని సీఎం ఎంతో ప్రయత్నిస్తున్నారన్నారు. అందరి సమస్యలు ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం అవుతాయన్నారు ఈటల.