
సీఎం కేసీఆర్ ను కలిశారు టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు. క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి కేసీఆర్ తో సమావేశమయ్యారు కేకే. ఆర్టీసీ సమ్మెపై ఇద్దరు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఆర్ఎస్ నేతల్లో కేకే ఒక్కరే మద్దతుగా మాట్లాడారు. ప్రభుత్వం – కార్మికుల మధ్య చర్చలు జరగాలన్నారు. చర్చలకు మధ్యవర్తిగా ఉంటానని ప్రకటించారు. కేసీఆర్-కేకే మీటింగ్ లో హోంమంత్రి మహమూద్ అలీ కూడా పాల్గొన్నారు.