
సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన పట్టభద్రుల MLC ఎన్నికల ప్రచారంలో.. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తీరుపై విరుచుకుపడ్డాడు ఓ టీఆర్ఎస్ నేత. చిలుకూరు మండల TRS పార్టీ మాజీ అధ్యక్షుడు వట్టికూటి నాగయ్య.. సభా వేదికపై ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని నిలదీశాడు. ఆరేళ్ల కింద పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచి.. తర్వాత కనబడలేదన్నారు. మళ్లీ ఇప్పుడు వచ్చి గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు నాగయ్య. సభలో ఉన్నవాళ్లు నాగయ్య మాటలకు మద్దతుగా ఒక్కసారిగా ఈలలు, కేకలు వేశారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పూర్తి బాధ్యతలు తీసుకుంటేనే.. పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓట్లు పడుతాయన్నాడు నాగయ్య.