మైనర్ పై టీఆర్ఎస్ లీడర్ అత్యాచారం

మైనర్ పై టీఆర్ఎస్ లీడర్ అత్యాచారం

కామారెడ్డి జిల్లా : మాచారెడ్డి మండల కేంద్రంలో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు సయ్యద్ ఆసిఫ్. మైనర్ బాలికకు ఆసిఫ్ మేనమామ కావడంతో ప్రతిరోజు ఇంటికి రాకపోకలు సాగించాడు. ప్రతి చిన్న పనికి బైక్ పై కామారెడ్డికి మైనర్ బాలికను ఆసిఫ్ తీసుకెళ్లేవాడని ఆరోపించారు స్థానికులు.  సయ్యద్ ఆసిఫ్ బంధువు కావడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదన్నారు.  కొన్ని రోజుల క్రితం మైనర్ బాలిక అస్వస్థతకు గురికావడంతో.. హాస్పిటల్ కి తరలించగా బాలిక గర్భవతి అని డాక్టర్లు తెలుపడంతో అసలు విషయం బయటపడింది. ఆసిఫ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు మైనర్ బాలిక తల్లిదండ్రులు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.