530 అడుగులకు నాగార్జున సాగర్ నీటిమట్టం

530 అడుగులకు నాగార్జున సాగర్ నీటిమట్టం

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం వద్ద విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 58,391 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా.. అది సాగర్‌లోకి వచ్చి చేరుతోంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 530 అడుగులకు (168.1460 టీఎంసీలు) నీరు చేరింది. సాగర్‌ నుంచి ఎడమ కాల్వకు 3,374 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ (ఎమ్మార్పీ)కి 1,350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.