మద్యం మత్తులో బూతులు తిడుతూ.. సెక్రటరీని కొట్టిన టీఆర్ఎస్ లీడర్

మద్యం మత్తులో బూతులు తిడుతూ.. సెక్రటరీని కొట్టిన టీఆర్ఎస్ లీడర్

సూర్యాపేట జిల్లా: కోదాడ మండలం కాపుగల్లు పంచాయతీ జూనియర్ కార్యదర్శిపై దాడి చేశాడు టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాలెబోయిన పాపారావు. ఉపాధిహామీ పథకం విషయంలో.. జూనియర్ కార్యదర్శి వెంకట నారాయణపై చేయి చేసుకున్నాడు. మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టాడని అంటున్నారు బాధితుడు. జూనియర్ కార్యదర్శిపై దాడికి పాల్పడిన టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎంపీడీవో కార్యాలయం ముందు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. 

 

 

ఇవి కూడా చదవండి

వరంగల్ లో ల్యాండ్ పూలింగ్ నిలిపివేత

మరోసారి బయటపడ్డ ఇంటర్ బోర్డు తప్పిదం

దేశ ద్రోహం చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయొద్దు

మీ ఇంటికే బీపీ, షుగర్ గోలీలు