
సిద్దిపేట్ ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి దారుణంగా తయారయ్యింది. వృద్ధులను డాక్టర్లను అసలే పట్టించుకోవడం లేదని..ట్రీట్మెంట్ కూడా సరిగా లేదంటున్నారు బాధితులు. దీనికి సంబంధించి TRS లీడర్లే వీడియోలు విడుదల చేస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తన తల్లిని కోల్పోయానని TRS మైనార్టీ లీడర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్, ఆక్సిజన్, వైద్యం ఏదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంతేకాదు..అవసరమైన డాక్టర్లు, సిబ్బందిని ప్రభుత్వం నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి హరీష్ రావు ఆస్పత్రిని విజిట్ చేసిన తర్వాత కూడా పరిస్థితులు మారలేదంటున్నారు. వృద్దులైతే అసలే పట్టించుకోవడం లేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి ఆక్సిజన్ అవసరమైనా పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితమే ప్రభుత్వ ఆస్పత్రిలో తండ్రిని కోల్పోయాడు TRS లీడర్ జీవన్ రాజ్. గొప్పగా చెప్పుకునే సిద్దిపేటలోనే ఇంతటి దారుణం ఏంటని ప్రశ్నిస్తున్నారు TRS లీడర్లు.
ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేక పోవడంతో ఎవరిని ఏమనాలో తెలియక ఆస్పత్రి స్టాఫ్ పైనే బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిర్లక్ష్యంతోనే నా తల్లి చనిపోయింది | TRS Minority Leaders Fires on KCR's Govt | V6 Newsనిర్లక్ష్యంతోనే నా తల్లి చనిపోయింది #TRSLeaders #CMKCR #TSGovt #Siddipet #V6Velugu
Posted by V6 News on Friday, May 21, 2021