
నామినేషన్ వేయడానికి వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి , సాఫ్ట్ వేర్ ఉద్యోగి చంద్ర శేఖర్ పై టిఆర్ఎస్ నాయకుల దాడి చేశారు. నామినేషన్ పత్రాలను లాక్కొనే ప్రయత్నం చేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరకు సమయం అయిపోయిందని సాఫ్ట్ వేర్ ఉద్యోగి చంద్రశేఖర్ ను పోలీసులు లోపలికి అనుమతించలేదు. కావాలనే టీఆర్ఎస్ నేతలు నామినేషన్ వేయనీయలేదని.. గొడవ కారణంగా సమయం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సాఫ్ట్ వేర్ ఉద్యోగి చంద్రశేఖర్.