మున్సిపల్ ఎన్నికలు: టీఆర్ఎస్ లో భగ్గుమన్న విబేధాలు

మున్సిపల్ ఎన్నికలు: టీఆర్ఎస్ లో భగ్గుమన్న విబేధాలు

మున్సిపల్ ఎన్నికల ముందు ఆలంపూర్ టీఆర్ఎస్ లో విబేధాలు భగ్గుమన్నాయి. అయిజ మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో తన వర్గానికి అన్యాయం జరిగిందన్న కారణంతో ఆలంపూర్ TRS సీనియర్ నాయకుడు, MPP తిరుమల్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గద్వాల జడ్పీ సీఈవోకు అందజేశారు. ఇక TRS కు ఝలక్ ఇచ్చిన ఆయన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

తిరుమల్ రెడ్డి గతంలో అయిజ జడ్పీటీసీగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే అయిజ తొలి మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీఆర్ఎస్ దక్కించుకోవటంలోనూ తిరుమల్ రెడ్డిదే కీలకపాత్ర. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుకి ఈయన మంచి అనుచరుడు. ఐతే ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంకు తిరుమల్ రెడ్డి మధ్య కొంత కాలంగా విబేధాలు కొనసాగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడవు ముగిసిన కొద్ది సేపటిలోనే టీఆర్ఎస్ పార్టీకి, ఎంపీపీ పదవికి తిరుమల్ రెడ్డి రాజీనామా చేయటం చర్చానీయాంశంగా మారింది.