
రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. సెకండ్ వేవ్ వ్యాపిస్తుండడంతో నిమ్స్ లో కరోనా టీకా తీసుకున్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఆరోగ్య శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత కూడా వ్యాక్సిన్ వేసుకున్నారు. వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. కేసులు పెరుగుతుండడంతో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.