గ్రేటర్ ఎన్నికల్లో కారుకు డిపాజిట్లు కూడా దక్కని స్థానాలివే

గ్రేటర్ ఎన్నికల్లో కారుకు డిపాజిట్లు కూడా దక్కని స్థానాలివే

గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్​ఎస్​కు పెద్ద దెబ్బే తగిలింది. అది కూడా తన దోస్త్​పార్టీ ఎంఐఎం నుంచే ఎదురైంది. కారు పార్టీ మొత్తంగా 30  డివిజన్లలో డిపాజిట్లు కోల్పోయింది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన డివిజన్లలోనే ఈసారి డిపాజిట్లు కోల్పోవడంతో నేతల్లో టెన్షన్ మొదలైంది. 2016 గ్రేటర్​ఎన్నికల్లో షేక్​పేట్​డివిజన్​లో 650 ఓట్ల స్వల్ప తేడాతో ఎంఐఎంపై ఓటమి పాలైన టీఆర్ఎస్​ ఈసారి అక్కడ డిపాజిట్​కూడా దక్కించుకోలేక పోయింది. ఎంఐఎం గెలిచినప్పటికీ రెండోస్థానంలో బీజేపీ నిలిచింది. టీఆర్ఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇలా చాలా ప్రాంతాల్లో గులాబీ పార్టీకి ఓట్ల సంఖ్య కూడా భారీగా తగ్గింది.  గత ఎన్నికల్లో కేవలం  నాలుగు సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి 149స్థానాల్లో పోటీ చేసింది. ఈసారి కమలం పార్టీ సీట్లు, ఓట్ల శాతం పరంగా మెరుగుపడింది.

రెండో స్థానంలోనూ తక్కువే

గ్రేటర్​ లో సింగిల్​లార్జెస్ట్​ పార్టీగా టీఆర్ఎస్ అవతరించినప్పటికీ ఇతర పార్టీలకు గట్టి పోటీని ఇవ్వలేకపోయింది. 56 డివిజన్లలో  గెలిచిన ఆ​పార్టీ క్యాండిడేట్లు మరో 66 డివిజన్లలో రెండో స్థానం లో ఉన్నారు. మూడో స్థానంలో 26 మంది ఉండగా, ఇద్దరు నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు.

టీఆర్ఎస్​ డిపాజిట్లు కోల్పోయిన డివిజన్లు 

అజంపురా, చావ్​నీ, డబీర్​పురా, పత్తర్​ఘట్టీ, మొఘల్​పురా, తలాబ్​చంచలం, లలితాబాగ్​, కుర్మగూడ, సంతోష్​ నగర్​, రియాసత్​నగర్​, కంచన్​బాగ్, బార్కాస్​, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, ఫలక్​నుమా, నవాబుసాహెబ్​ కుంట, శాలిబండ, ఘాన్సీబజార్​, పురానపూల్​, దూద్​బౌలి, జహనుమా,రామ్నాస్త్​పురా, దత్తాత్రేయనగర్​, టోలిచౌకి, నానల్​నగర్​,మెహిదీపట్నం,ఆసిఫ్​నగర్​, విజయనగర్​ కాలనీ, మల్లేపల్లి,షేక్​ పేట్​డివిజన్లు.

బీజేపీ డిపాజిట్లు కోల్పోయిన డివిజన్లు

అజంపురా,చావ్​నీ,పత్తర్​ఘట్టీ,తలాబ్​ చంచలం, సంతోష్​ నగర్​,రియాసత్ నగర్​,కంచన్​బాగ్​,బార్కాస్,చాంద్రాయణగుట్ట,ఫలక్​నుమా,జహనుమా,రామ్నాస్త్​పురా, కిషన్​బాగ్​, సులేమాన్​నగర్​,శాస్ర్తిపురం, గోల్కొండ, టోలిచౌకి, నానల్​ నగర్ ఉన్నాయి.

ఓల్డ్ సిటీలో అట్టర్​ ప్లాప్

ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్​ ఓల్డ్​సిటీలో అట్టర్​ప్లాప్ అయింది. డిపాజిట్లు కోల్పోయిన డివిజన్లలో ఎక్కువగా ఇక్కడే ఉన్నాయి.  ఎన్నికల్లో పోటీలో దింపిన క్యాండిడేట్లపై ప్రభుత్వ పథకాలతో గెలుపుపై అధిష్టానం ధీమా వ్యక్తం చేసింది. షాదీ ముబారక్ స్కీమ్​తో ఎంతో మంది ముస్లింలు లబ్ధిపొందుతున్నారని, తమ గెలుపునకు ఆ స్కీమ్​ ఉపయోగపడుతుందని క్యాండిడేట్లు అనుకున్నప్పటికీ డిపాజిట్లు కూడా రాకపోవడంతో ఆ పార్టీ నేతలు ఆందోళనలో పడిపోయారు. 2016 ఎన్నికల్లోనూ ఓట్ల సంఖ్య ఇప్పటి కంటే ఎక్కువగానే వచ్చినప్పటికీ ఈసారి ఓట్ బ్యాంక్​ లేకుండా పోయింది. భవిష్యత్​లో ఓల్డ్​ సిటీలో టీఆర్ఎస్​నుంచి  సపోర్టు చేసేందుకు క్యాండిడేట్లు రావడం కష్టంగానే ఉండొచ్చు.