
రాజన్నసిరిసిల్ల, వెలుగు: జర్నలిస్ట్ ప్రసాద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చొప్పదండి ఎమ్యెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన జర్నలిస్ట్ ప్రసాద్ రెండు రోజుల కింద గుండెపోటుతో చనిపోయారు. ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే సత్యం సోమవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసాద్ అందరితో కలివిడిగా ఉండేవారని, ఆయన చిన్న వయసులో గుండెపోటుతో చనిపోవడం బాధాకరమన్నారు. ప్రసాద్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ప్రసాద్ ముగ్గురు పిల్లలకు అండగా ఉంటామన్నారు. అనంతరం తక్షణ సాయం కింద రూ.20 వేలు అందించారు. ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ ప్రకాశ్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.