నిరుద్యోగ సమస్యపై లోక్సభలో టీఆర్ఎస్ ఆందోళన

నిరుద్యోగ సమస్యపై లోక్సభలో టీఆర్ఎస్ ఆందోళన

న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు అన్నారు. ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నిరుద్యోగ సమస్యపై లోక్‌సభ నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీలు వాకౌట్‌ చేశారు. అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ సర్కారు ప్రకటించిందని.. ఎనిమిదేండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో వెల్లడించాలని ఎంపీ నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. 2014తో పోలిస్తే దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిందన్నారు. ఉద్యోగాలు లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. 

‘కేంద్రంలో ప్రస్తుతం 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నిరుద్యోగం సీరియస్ అంశం. గ్రామీణ స్థాయిలోనూ నిరుద్యోగం పెరిగింది. ఉపాధి హామీ పథకం కింద ఎన్రోల్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఉపాధిహామీ పథకానికి బడ్జెట్ లో నిధులు తగ్గిస్తున్నారు. ఉద్యోగ కల్పన కోసం నిధులు పెంచాల్సింది పోయి తగ్గిస్తున్నారు. ఉద్యోగ కల్పన లేకపోవడం వల్లే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలి. ఉద్యోగ కల్పన పై ఇచ్చిన హామీలను అమలు పరచాలి. టీఆర్ఎస్ యువతకు అండగా ఉంటుంది. భవిష్యత్ లో ఎప్పుడు అవకాశం వచ్చినా పోరాడుతాం’ అని నామా అన్నారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

కరెంట్ చార్జీల పెంపు దారుణం 

కశ్మీరీలకు రూమ్స్ అద్దెకివ్వమన్న హోటల్

ఐస్​తో అలసట మాయం