బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్ లో ప్రమాణం చేయాలి

బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్ లో ప్రమాణం చేయాలి

ఈటల రాజేందర్ కేసీఆర్ కు రాసిన లేఖ ఫేక్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  భాగ్యలక్ష్మి టెంపుల్ లో ప్రమాణం చేయాలన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్. హుజురాబాద్ లో TRS సోషల్ మీడియా కార్యకర్తల  సమావేశానికి హాజరైన  బాల్కసుమన్.. టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను మోసం చేసిన ఈటల రాజేందర్ ఇక నుంచి వెన్నుపోటు రాజేందర్ అన్నారు. మంత్రి పదవి పోగానే కేసీఆర్ దొర, నియంత, దెయ్యం అయ్యాడా? అని ప్రశ్నించారు. తెలంగాణకు ద్రోహం చేసిన బీజేపీ లో ఈటల ఎలా చేరారని ప్రశ్నించారు. తాను తెలంగాణ ప్రజల బానిసనని..టీఆర్ఎస్ కు కట్టు బానిసనన్నారు. చచ్చేదాక కేసీఆర్ వెంటే ఉంటానన్నారు. తాను పైసలు, పదవుల కోసం పూటకో వేషం మార్చే వాడిని కాదన్నారు.