అధికారులపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆగ్రహం.. 

అధికారులపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆగ్రహం.. 

అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేదిలేదంటూ కాంట్రాక్టర్, అధికారుల పనితీరుపై పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం లక్డారం గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో రూ.24 లక్షల వ్యయంతో చేపట్టిన పాఠశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో పాఠశాల భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తూతూ మంత్రంగా పనులు చేసిన కాంట్రాక్టర్ ను, సంబందిత అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. పాఠశాల నూతన భవన నిర్మాణంలో నాణ్యత లేదని కనీసం శుభ్రత లేదని మండిపడ్డారు. ప్రమాదకరంగా ఇనుప రాడ్లు ఉన్నాయని, మీ సొంత ఇల్లు కడితే ఇలాగే చేస్తారా అంటూ, అధికారులపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహించారు.