షర్మిలను విమర్శిస్తూ  టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ట్వీట్

షర్మిలను విమర్శిస్తూ  టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ట్వీట్

ఆదిలాబాద్: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సెటైర్లు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం షర్మిల ఢిల్లీలో సీబీఐ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో షర్మిలపై ట్విట్టర్ వేదికగా క్రాంతి కిరణ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. క్విడ్ ప్రో కో ద్వారా దేశంలోనే అత్యంత అవినీతికి పాల్పడిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి  అపాయింట్మెంట్ ఇవ్వొచ్చా అని ఆయన సీబీఐని ప్రశ్నించారు. ‘‘ విచారణ అధికారుల హోదాలు కూడా ముందే చెప్పొచ్చా ?  జస్ట్ తెలుసుకుందామని’’ అంటూ క్రాంతి కిరణ్ ట్వీట్ చేశారు.

అయితే తన ట్వీట్ లో ఆయన ఎక్కడా కూడా షర్మిల పేరు ఎత్తలేదు. కానీ ఓ పేపర్ లో వచ్చిన వార్తను ట్వీట్ కి అటాచ్ చేశారు. ఇకపోతే... కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మేఘా కంపెనీతో కలిసి కేసీఆర్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని షర్మిల ఆరోపించారు. అవసరం లేకున్నా డిజైన్ మార్చి.. ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని ఎక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. ఇందుకోసం నిబంధనలు మార్చారని ఫైర్ అయ్యారు. తక్షణమే కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.