
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మ రావు అగ్రవర్ణాలకు బీసీ టికెట్ అమ్ముకున్నాడన్నారు తార్నాక కార్పొరేటర్ సరస్వతి. 150 డివిజన్ ల్లో ఒకే ఒక్క వడ్డేర సీటును డిప్యూటీ స్పీకర్ పద్మ రావు అగ్ర వర్ణాలకు ఇచ్చాడని ఆమె ఆరోపించారు. టి.ఆర్.ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి తాము పార్టీ లోనే ఉన్నామని., 2016 లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో తార్నాక డివిజన్ ను 14000ల మెజారిటీలో గెలిచామని చెప్పారు. అన్ని సర్వే లు అనుకూలంగా వచ్చినా, తమకు టికెట్ ఇవ్వలేదని డిప్యూటీ స్పీకర్ పద్మ రావు పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మారావ్ గౌడ్ బీసీల ద్రోహీ అంటూ.. తడిబట్టతో తమ గొంతు కోశాడని ఆమె అన్నారు.