మనిషికి మూడు రకాల బలుపులుంటయ్…

మనిషికి మూడు రకాల బలుపులుంటయ్…

టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మనిషికి మూడు రకాల బలుపులుంటాయి. ఒకటి నేను రెడ్డి, వెలమ అని కుల బలుపు, రెండోది బాగా డబ్బు ఉన్నదని, మూడోది బాగా చదువుకున్నానన్న మూడు బలుపులు ఉంటాయి. మనిషికి ఇలాం టి వివక్ష ఉండకూడదు”అని ఎమ్మెల్యే శంకర్ నాయక్ కామెంట్ చేశారు. సోమవారం కేసముద్రం మండల కేంద్రంలో ఎమ్మెల్యే 250 మంది క్రిస్టియన్లకు, 30 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ‘‘ఎవరిని కోసినా అదే రక్తం వస్తుం ది, అందరూ తినేది అదే అన్నం , అదే నీరు, అదే గాలి!మరి మనుషుల మధ్య అంతరాలెందుకు?’అని శంకర్ నాయక్ ప్రశ్నించారు. ఆపదలో ఆదుకునుడే మనిషి లక్షణం అన్నారు.