
అబ్దుల్లాపూర్ తహశీల్దార్ విజయారెడ్డి ఘటనలో అధికార పార్టీ MLA హస్తముందని ఆరోపించారు కాంగ్రెస్ మాజీ MLA మల్ రెడ్డి రంగారెడ్డి. ఘటనపై CBI విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్… దీనిపై స్పందించాలన్నారు.
విజయారెడ్డి ఎంతో నీతి, నిజాయితీగా పనిచేసేదని చెప్పారు మల్ రెడ్డి. భూమాఫియాకు అండగా ఉన్న అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస భద్రత కరువైందని ఆరోపించారు మల్ రెడ్డి రంగారెడ్డి.