
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్ రావు పేరును ప్రకటించారు సీఎం కేసీఆర్. గుత్తా సుఖేందర్ రెడ్డికి, నవీన్ రావుకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని ఎంపీ ఎన్నికల్లో హామీ ఇచ్చారు కేసీఆర్. అయితే ప్రస్తుతం ఒకే ఖాళీ ఉండడంతో నవీన్ రావుకు అవకాశం ఇచ్చినట్లు కేసీఆర్ చెప్పారు. త్వరలో జరగబోయే మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం ఇస్తామని ప్రకటించారు కేసీఆర్.