లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి దేశమంతటా చావుదెబ్బే

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి దేశమంతటా చావుదెబ్బే

హైదరాబాద్‌, వెలుగు: దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. వాటన్నింటినీ సీఎం కేసీఆర్‌ ఎక్కడ కూడగడతారోనని ఆయనను తెలంగాణకే పరిమితం చేసే ఉద్దేశంతో సమస్యలు సృష్టిస్తున్నారని మంగళవారం ఆరోపించారు. ‘‘ఈ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నరు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని దేశ ప్రజలు చావుదెబ్బ కొట్టబోతున్నరు. పరిణామాలు, సమీకరణాలు, పొత్తుల వంటివి ఎట్లుంటయనేది మున్ముందు తెలుస్తది. యాంటీ బీజేపీ శక్తులన్నీ ఒక్కటైతై. బీజేపీని తప్పకుండా ఓడిస్తయి’’ అని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఆయా పార్టీలతో ఎలా పని చేయాలనేది రాబోయే రోజుల్లో కేసీఆర్‌ నిర్ణయిస్తారన్నారు. యూపీ ఎన్నికల్లో అఖిలేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బకు మోడీ, అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా మూతి, ముక్కు పగిలి బొక్క బోర్లా పడుడు ఖాయం. పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఆప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బకు బీజేపీ విలవిల్లాడబోతున్నది” అన్నారు. రైతు, దళిత వ్యతిరేక బీజేపీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ నేతలు చౌకబారు రాజకీయాలు మానుకోవాలన్నారు. 

మోడీ వల్ల అసమానతలు
మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలో అసమానతలు పెరిగాయని కడియం అన్నారు. ‘‘ప్రభుత్వరంగ సంస్థలను ఇష్టానికి మూసేసి నిరుద్యోగ సమస్య పెంచుతున్నరు. దేశంలో కేవలం ఒక్క శాతం మంది చేతిల ఏకంగ 22 శాతం సంపద ఉన్నది. 10 శాతం జనాభా చేతిలో 57 శాతం సంపద ఉంది. 50 శాతం మంది వార్షికాదాయం రూ.53 వేలే. ప్రభుత్వరంగ సంస్థల నుంచి ఇప్పటికే రూ.10.8 లక్షల కోట్ల పెట్టుబడులను కేంద్రం ఉపసంహరించింది. మున్ముందు మరో రూ.10 లక్షల కోట్లు ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలుంటే అక్కడ మోడీ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కర్నాటక, గోవాల్లో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చారు” అన్నారు. రాజకీయాల్లో విధానాలపై విమర్శలు చేయాలే తప్ప వ్యక్తిగత దూషణలు సరికాదని కడియం అన్నారు. ‘‘బీజేపీ నేతలు సీఎంను ఏకవచనంతో మాట్లాడుతున్నరు. వ్యక్తిగతంగా దాడి చేస్తున్నరు. ఇది పద్ధతి కాదు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనలో ఏడున్నరేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తే బీజేపీ నేతలు అభివృద్ధికి మోకాలడ్డుతున్నరు” అని ఫైరయ్యారు. కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ పలుకుబడితో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాలన్నారు.