పంజాబ్‌లో ఎలా కొంటున్నరో.. తెలంగాణలోనూ అట్లనే కొనాలె

పంజాబ్‌లో ఎలా కొంటున్నరో.. తెలంగాణలోనూ అట్లనే కొనాలె

హైదరాబాద్: బీజేపీ ధర్నాలు చేయాల్సింది ఇక్కడ కాదని.. ఢిల్లీలో అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ నిరసనల్లో రైతులెవరూ పాల్గొనడం లేదన్నారు. ఎటువంటి సమాచారం లేకుండా బీజేపీ ఈ రోజు ధర్మాలకు పిలుపునిచ్చిందని చెప్పారు. మార్కెట్‌లు మూసేయాలని బీజేపీ చట్టం తీసుకొచ్చినా.. తెలంగాణలో మార్కెట్‌లు ఓపెన్‌గా పెట్టామన్నారు. బీజేపీ డ్రామాలు ఆపాలన్నారు. 

పంజాబ్‌లో ఎలా కొంటున్నరో.. అలాగే కొనాలె

‘వానాకాలంలో పంట మొత్తం కొనేందుకు 6,663 కొనుగోలు సెంటర్‌‌లు ఓపెన్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 3,500 కొనుగోలు సెంటర్‌‌లు ఓపెన్ అయ్యాయి. పంటలను బట్టి కొనుగోలు సెంటర్‌‌లను తెరుస్తాం. ఇన్నాళ్లు ధాన్యం కొన్నది కేంద్రమే.. కొనడం వాళ్ల బాధ్యతేనని బీజేపీ, కేంద్రం అడ్డుప్డడా..  సివిల్ సప్లైస్ డిపార్ట్‌‌మెంట్ ద్వారా ధాన్యం కొన్నాం.  రెండు, మూడ్రోజుల్లోనే డబ్బులు ఇస్తున్నాం. ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలి. వచ్చే యాసంగిలో వడ్లు కొంటారా కొనరా చెప్పండి. 80 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పంజాబ్‌‌లో 2 కోట్ల మెట్రిక్ టన్నుల  ధాన్యం ఎలా కొంటున్నారో చెప్పాలి. కేంద్రం యాసంగిలో ఇక్కడ కూడా కొనాలి. కొంటమని లెటర్ ఇవ్వాలి’ అని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.