
దాదాపు రూ.100 కోట్ల విలువైన కోళ్ల దాణా కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ ఆరోపించారు. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఈ కుంభకోణంలో ఉన్నారని పేర్కొన్నారు. మార్క్ ఫెడ్ నుంచి మక్కలు తీసుకుని మోసం చేశారని విమర్శించారు. సబ్సిడీ రూపంలో తీసుకున్న మక్కలను తిరిగి ఎక్కువ రేటుకు అమ్ముకున్నారని ఆరోపించారు.
దీని వల్ల చిన్న సన్నకారు రైతులు నష్టపోయారని విమర్శించారు. ఈ కుంభ కోణంలో పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారని తెలిపారు. దాణా కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కోడిని, దాణాను ప్రెస్ మీట్ కు తెచ్చి మరీ కుంభకోణం గురించి అనిల్ వివరించారు.