మునుగోడులో టీఆర్‌‌ఎస్‌‌కు షాక్‌‌

మునుగోడులో టీఆర్‌‌ఎస్‌‌కు షాక్‌‌

చండూరు, వెలుగు : మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మునుగోడు, చండూరు మండలాలకు చెందిన టిఆర్ఎస్ పార్టీ  ఎంపీటీసీలు, సర్పంచులు బుధవారం మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసంలో ఆయన్ను కలిసి బీజేపీలో చేరారు. నియోజకవర్గంలో గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అది బీజేపీతోనే సాధ్యమవుతుందని, మోడీ పథకాలు ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయని భావించి చేరుతున్నట్లు వారు చెప్పారు.

బీజేపీలో చేరిన వారిలో చండూరు మండలంలోని నెర్మట సర్పంచ్ నందికొండ నరసింహారెడ్డి, చొప్పరి వారిగూడెం సర్పంచ్ అనురాధ వెంకన్న, తుమ్మలపల్లి సర్పంచ్ కురుపాటి రాములమ్మ, కస్తాల సర్పంచ్ మెండు ద్రౌపది వెంకటరెడ్డి, మునుగోడు మండలం నుంచి చల్మెడ సర్పంచ్ కర్నాటి ఊశయ్య, కొండాపురం ఎంపీటీసీ చేపూరి యాదయ్య ఉన్నారు. మరి కొంతమంది సర్పంచులు ఎంపీటీసీలు త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. కార్యక్రమంలో ఎంపీటీసీ పల్లె వెంకన్న, వెంకటేశ్ యాదవ్ పాల్గొన్నారు.