ప్రత్యేక బస్సుల్లో గోవాకు టీఆర్‌‌ఎస్ ఎంపీటీసీ, జడ్పీటీసీలు

V6 Velugu Posted on Nov 30, 2021

ఖమ్మం, వెలుగు: లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో క్యాంపుల రాజకీయం షురూ అయింది. సోమవారం ఖమ్మం నగరం నుంచి పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు సభ్యులు క్యాంపునకు బయల్దేరి వెళ్లారు. వివిధ మండలాల నుంచి మధ్యాహ్నం వరకు ఖమ్మంలోని ఎస్​ఆర్​ కన్వెన్షన్​ కు చేరుకున్నారు. అక్కడ ఓటర్లతో పార్టీ ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, టీఆర్ఎస్​ రాష్ట్ర నేత గాయత్రి రవితో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు సమావేశమయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్​ కు బస్సుల్లో తరలించారు. అక్కడి నుంచి ఓటర్లను గోవాకు తీసుకెళ్తున్నట్టు టీఆర్ఎస్​ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో కల్లూరు మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు  గోవాలో క్యాంపు వేసేందుకు ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్లారు.

చలో క్యాంపులకు.. 

ఆదిలాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఆదిలాబాద్​కు చెందిన ప్రజాప్రతినిధులను  క్యాంపునకు తరలించారు. హైదరాబాద్​కు వెళ్లిన తర్వాత ఎక్కడికి వెళ్లాలన్నది డిసైడ్​ చేస్తారని తెలిసింది. సోమవారం రాత్రి ఆదిలాబాద్​ ఎమ్మెల్యే జోగు రామన్న క్యాంపు ఆఫీసు నుంచి స్పెషల్​ బస్సుల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు బయలుదేరారు.

Tagged TRS, Telangana, CM KCR, Khammam, MLC Elections, zptc, MPTC, goa, Camp Politics

Latest Videos

Subscribe Now

More News