తగ్గిన మెంబర్​షిప్స్ : మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలకు కేటీఆర్ క్లాస్

తగ్గిన మెంబర్​షిప్స్ : మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలకు కేటీఆర్ క్లాస్

మంత్రి కేటీఆర్ సీరియస్కొ
న్నిచోట్ల 10 వేలు కూడా కాలే
ఒక మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలకు క్లాస్

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు ఆశించినంతగా జరగకపోవటంపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. కొన్ని నియోజకవర్గాల్లో 10 వేలు కూడా కాకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి సభ్యత్వ నమోదు చేయకుండా ఏం చేస్తున్నారని క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. వీరిలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, నరేందర్ రెడ్డి, కోరుకంటి చందర్ తో పాటు ఓ మంత్రికి సోమవారం ఫోన్ చేసి సీరియస్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘మీరే పార్టీ సభ్యత్వం చేయకపోతే మిగతా వాళ్లకు ఏం చెప్తరు?’ అని ఆ మంత్రితో కేటీఆర్ అన్నట్లు తెలిసింది. సభ్యత్వ నమోదుకు ఇచ్చిన టైమ్ అయిపోయిందని ఇంకో వారం టైమ్ తీసుకొని సభ్యత్వాల టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. 10 వేల లోపు సభ్యత్వాలు నమోదు చేసిన ఎమ్మెల్యేల లిస్ట్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. వారితో సీఎం కేసీఆర్ మాట్లాడుతారని కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.

పార్టీ కమిటీల మీద దృష్టి పెట్టండి

సభ్యత్వ నమోదు పూర్తి కాగానే పార్టీ కమిటీల మీద దృష్టి పెట్టి, నెలాఖరు కల్లా పూర్తి చేయాలని లీడర్లను కేటీఆర్ ఆదేశించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 6 ఉమ్మడి జిల్లాలకు సభ్యత్వ నమోదుకు అదనపు టైమ్ ఇవ్వాలని కొందరు నేతలు కేటీఆర్ ను కోరారు. వారం, పది రోజులపాటు పొడిగించాలని పలువురు ఎమ్మెల్యేలు కోరారని జనరల్ సెక్రటరీలు తెలియజేశారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్​కు చెబుతామని, ఆయన ఆదేశాల మేరకు గడువు పెంచడంపై స్పష్టత ఇస్తామని కేటీఆర్ తెలిపారు. సభ్యత్వాల డిజిటలైజేషన్ వేగంగా కొనసాగుతోందని, సుమారు 50 శాతం మెంబర్​షిప్స్ వివరాలను కంప్యూటరైజ్ చేశామని చెప్పారు.