వడ్ల కొనుగోలుపై ఖమ్మంలో టీఆర్ఎస్ నిరసన

 వడ్ల కొనుగోలుపై ఖమ్మంలో టీఆర్ఎస్ నిరసన

వడ్ల కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ ఒకరేంజ్ లో నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నల్లజెండాలతో టీఆర్ఎస్ నేతలు నిరసన తెలియజేస్తున్నారు. వ‌రి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.బైక్ పై నల్లజెండాలు పట్టుకుని పట్టణంలోని ప్రధాన రహదారుల్లో భారీ ర్యాలీ చేశారు. ఈ బైక్ ర్యాలీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మనస్సు మార్చుకుని రైతులు పండించిన యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం

అమ్మో నిమ్మా! భారీగా పెరిగిన ధరలు

కోహ్లీ, కుంబ్లే గొడవపై నోరు విప్పిన వినోద్ రాయ్