నలుగురు ఎమ్మెల్యేలు వాస్తవాలు ఎందుకు చెప్పడం లేదు : రాకేష్ రెడ్డి

నలుగురు ఎమ్మెల్యేలు వాస్తవాలు ఎందుకు చెప్పడం లేదు :  రాకేష్ రెడ్డి

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నలుగురు ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు ఎందుకు చెప్పడం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. ప్రగతి భవన్ లో శిక్షణ తీసుకుంటున్నారా అని సటైర్ వేశారు. రాష్ట్ర ప్రజానీకానికి, మునుగోడు ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

మునుగోడు ఉప ఎన్నిక కోసం సీఎం కేసీఆర్ పడరాని పాట్లు పడుతున్నారని రాకేష్ రెడ్డి విమర్శించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని నిలదీశారు. దమ్ముంటే ఈ అంశంపై మాట్లాడేందుకు బయటికి రావాలని సవాల్ విసిరారు. ఒక్క బీజేపీ అభ్యర్థిని అడ్డుకోవడానికి 100 మంది నాయకులను దించినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. పోలీసు అధికారి స్టీఫెన్ రవీంద్ర పట్టుకున్న డబ్బును బయట పెట్టాలని లేనిపక్షంలో రాజీనామా చేయాలని సూచించారు. ఎన్నికలను పోలీసులు స్వేచ్ఛగా నడిపించాలే కానీ.. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.