
మాజీ మంత్రి,టీఆర్ఎస్ సీనియర్ నేత కమతం రాంరెడ్డి(83) కన్నుమూశారు. మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ కు చెందిన రాంరెడ్డి అనారోగ్యం కారణంగా ఇవాళ(శనివారం) ఉదయం తుది శ్వాస విడిచారు. ఉమ్మడి ఏపీలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం ఆయన కాంగ్రెస్ లోనే పనిచేశారు..2014 లో కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు..టీడీపీ,బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పరిగి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల సమయానికి బీజేపీ ఆయన్ని సస్పెండ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ సమక్షంలో కమతం రాంరెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. కానీ వయసు కారణంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కమతం రాంరెడ్డి గతంలో ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పని చేశారు. జలగం వెంకట్రావు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సయయంలో వారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. కమతం రాంరెడ్డి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.