
వరుసగా మూడో రోజు.. పాక్ తన కుఠిల బుద్ధిని చూపిస్తోంది. రాత్రి అయిన తర్వాత కాల్పులకు తెగబడుతోంది. బుధ, గురువారాల్లో (మే 7, 8) రాత్రుళ్లో డ్రోన్లను ప్రయోగించిన పాక్.. శుక్రవారం (మే 9) కూడా అదే రీతిలో డ్రాన్స్, మిస్సైల్స్ తో దాడికి దిగింది. పాక్ ప్రయోగాన్ని భారత్ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతోంది. ప్రత్యేక రాడార్ సిస్టం ద్వారా నిర్వీర్యం చేస్తోంది.
చేసిన తప్పుకు అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలిచిన పాక్.. చర్చల ద్వారా ఉద్రిక్తలను తగ్గించేందుకు ప్రయత్నిస్తుందని భావించిన తరుణంలో.. తన ఉగ్రవాద వైఖరి చూపిస్తూనే ఉంది. ఇరు దేశాల మధ్య ఏర్పిడిన ఉద్రిక్త వాతావరణం మేరకు బార్డర్ లోని ఎయిర్ పోర్టులను మే 15 వరకు మూసివేయాలని పౌరవిమానయాన శాఖ నిర్ణయించింది. నార్త్, వెస్టర్న్, సెంట్రల్ ఇండియాలోని మొత్తం 27 విమానాశ్రయాలను మూసివేయాలని నిర్ణయించింది.
శ్రీనగర్, జైసల్మేర్, రాజ్ కోట్ సహా మొత్తం 27 ఎయిర్ పోర్టులు మే 15 ఉదయం 5.29 గంటలకు మూసి ఉంటాయి. బుధ, గురువారం నుంచి రాత్రి 8 గంటల నుంచి పాక్ దాడులు మొదలు పెట్టడంతో శ్రీనగర్, జమ్ము, లెహ్, పఠాన్ కోట్, చంఢీగర్, అమృత్ సర్, లూథియానా, పాఠియాలా, బఠిండా, హల్వారా, శిమ్లా జోద్ పూర్, జైసల్మేర్, జామ్ నగర్ తదితర విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడనున్నాయి. మే 15 ఉదయం 5.29 వరకు ఆయా ప్రాంతాలలో విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది.